''దైవమును తల్లిగా ధ్యానించడమే అంబికాధ్యానం. అర్జునుడు శ్రీ కృష్ణుని స్నేహితునిగా తలచాడు. యశోదకు కృష్ణుడు బిడ్డడే అయినాడు గదా! రుక్మిణీ, సత్యభామలు ఆయనను భర్తగా భావించారు. అందుచేత మనం అంబికను అమ్మగా భావనచేసి ధ్యానిస్తే, ఆమెయూ మాతృప్రేమతో మనలను ఒడిలోకి తీసుకుంటుంది. ఏ రూపంతో మనం ధ్యానించినా ఆరూపంతోవచ్చి అనుగ్రహంచే శక్తి పరమాత్మకుఉన్నది. పరబ్రహ్మ స్వరూపిణి అయిన అంబిక అమ్మయై మనలను ఆదరిస్తుందనడంలో సందేహంలేదు.''
|